తోడేలును కాపాడటానికి లైఫ్ ను రిస్క్ లో పెట్టాడు!

తోడేలును కాపాడటానికి లైఫ్ ను రిస్క్ లో పెట్టాడు!

రియల్ హీరో అంటూ నెటిజన్స్ మెచ్చుకోలు

న్యూఢిల్లీ: ఒక అడవిలో తోడేలును కాపాడటానికి ఓ వ్యక్తి తన ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. జంతువును రక్షించడానికి తన లైఫ్ ను ప్రమాదంలో పెట్టిన సదరు వ్యక్తిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ అతణ్ని పొగుడుతున్నారు. వివరాలు.. తోడేలు కాలుకు ఏదో గుచ్చుకోగా దాన్ని తీయడానికి సదరు వ్యక్తి యత్నించాడు. కర్ర సాయంతో తోడేలును కింద పడేసి, ఆ తర్వాత దాని కాలుకు గుచ్చుకున్న దాన్ని తీసేశాడు. వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోగా.. తోడేలు కూడా నిష్క్రమించింది. 52 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మీకు తిరిగివ్వలేని వారికి సాయం చేయనంత వరకు మీరు జీవించనట్లే. ఈ వ్యక్తి తోడేలును కాపాడటానికి తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు. ఈ క్రమంలో తనకు ఏదైనా ప్రమాదం తలెత్తితే తెలియజేయడానికి ఫోన్ ను కింద ఉంచి రికార్డు చేశాడు. తోడేలును కాపాడటానికి తన శాయశక్తులా యత్నించాడు’ అని ఈ పోస్ట్ కు క్యాప్షన్ జత చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోకు 45 వేల వ్యూస్ రావడం విశేషం.