గొడవ ఆపడానికిపోయిన యువకుడికి 22 కత్తిపోట్లు

గొడవ ఆపడానికిపోయిన యువకుడికి 22 కత్తిపోట్లు

ఢిల్లీలో దారుణం జరిగింది. తన దోస్తులతో గొడవపడుతున్న వారిని ఆపడానికి వెళ్లిన వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ఏకంగా 22 కత్తిపోట్లు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖేష్, రాకేష్, నీరజ్ అనే ముగ్గురు యువకులు స్నేహితులు. వీరిలో ముఖేష్, రాకేష్‌లు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. గతంలో వీరి స్థానంలో క్రిషన్, రవిలు పనిచేసేశారు. అయితే వీరి ప్రవర్తన సరిగా లేకపోవడంతో వీరిని తొలగించి కొత్తగా ముఖేష్, రాకేష్‌లను నియమించుకున్నారు. దాంతో క్రిషన్, రవిలిద్దరూ ముఖేష్, రాకేష్‌లపై పగ పెంచుకున్నారు.

బుధవారం ముఖేష్, రాకేష్‌లు ఆస్పత్రిలో విధులు ముగించుకొని తమ స్నేహితుడైన నీరజ్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు. దారి మధ్యలో క్రిషన్, రవిలు కలిసి ముఖేష్, రాకేష్‌లతో గొడవకు దిగారు. నలుగురి మధ్య చాలాసేపు వాదనలు జరిగాయి. సహనం కోల్పోయిన క్రిషన్, రవిలు ముఖేష్, రాకేష్‌లపై దాడికి దిగారు. దాంతో పక్కనే ఉన్న నీరజ్.. వారందరినీ ఆపడానికి గొడవ మధ్యలోకి వెళ్లాడు. ఈ గొడవలో క్రిషన్, రవిలు నీరజ్‌ను కత్తితో 22సార్లు పొడిచారు. దాంతో తీవ్ర రక్తస్రావమై నీరజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దాడిలో ముఖేష్, రాకేష్‌లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముఖేష్, రాకేష్‌ల ఫిర్యాదుతో క్రిషన్, రవిలను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

For More News..

నేడు సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ‌శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

మధ్యాహ్నం రాజీనామా.. కేటీఆర్ ఫోన్ కాల్‌తో రాత్రి విత్ డ్రా

నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం