తాండూరులో వడ్డీ కట్టలేదని..వ్యక్తిని కట్టేసి కొట్టిన్రు

తాండూరులో వడ్డీ కట్టలేదని..వ్యక్తిని కట్టేసి కొట్టిన్రు

వికారాబాద్ జిల్లా తాండూర్లో తీసుకున్న అప్పుకు సంబంధించి వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. చేతులు కట్టేసి పిడిగుద్దులతో బాధితుడిపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు. ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 

తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్య.. గాంధీనగర్ కు చెందిన మ్యాదరి రవి వద్ద మూడు నెలల క్రితం అప్పుగా రూ. 5వేలు తీసుకున్నాడు. దీనికి వడ్డీ నెలకు రూ.500 చొప్పున 1500 వడ్డీ కలిపి రూ. 6,500 అయింది. 

తీసుకున్న అప్పు, వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదని శుక్రవారం (మార్చి 22) బాలయ్య ఇంటికి వచ్చిన రవి అతనిపై దాడి చేశాడు. చేతులు కట్టేసి కర్రతో రక్తం వచ్చేలా కొట్టాడు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు.కాలితో తన్నాడు. కుటుంబ సభ్యులతో ఈదాడి ఘటనను వీడియో తీయించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.   

తీసుకున్న అప్పు డబ్బు, వడ్డీ ఇవ్వడం లేదని శుక్రవారం రవి బాలయ్యను ఇంటికి పిలిపించుకుని  చితక బాదాడు. ఈ దాడిని వీడియో తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది,అనంతరం బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించి  జరిగిన సంఘటనపైన ఫిర్యాదు చేశాడు. దీంతో రవిపై కేసు నమోదు చేశారు తాండూరు పోలీసులు.