1.5 కోట్ల ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి వీలునామా చేసిండు

1.5 కోట్ల ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి వీలునామా చేసిండు

ఉత్తరప్రదేశ్కు చెందిన నాథూ సింగ్ అనే 85 ఏళ్ల వ్యక్తి తన మొత్తం ఆస్తిని తన పిల్లలు ఎవరికి చెందకుండా ప్రభుత్వానికి వీలునామాగా రాశాడు. అంతేకాకుండా తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశాడు. తాను మరణించిన తర్వాత ఆ స్థలంలో ప్రభుత్వం పాఠశాల లేదా ఆసుపత్రిని నిర్మించాలని కోరాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు తన పిల్లలు  హాజరుకానివ్వకూడదని కోరాడు. జఫర్‌నగర్‌లో నివసిస్తున్న నాథూ సింగ్‌ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. అతనికి రూ. 1.5  కోట్ల విలువైన ఆస్తి ఉంది. ఇతనికి ఓ కొడుకు, నలుగురు కుమార్తెలున్నారు. అందరికీ వివాహం అయింది. భార్య చనిపోయక ఈ వయసులో తన కొడుకు, కోడలితో కలిసి ఉండాల్సింది కానీ వారెవరు కూడా పట్టించుకోకపోవడంతో తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి వీలునామా రాయాలని నిర్ణయించుకున్నాడు. నాథూసింగ్‌ అభ్యర్థనను నమోదు చేసినట్లు బుధానా తహసీల్ సబ్ రిజిస్ట్రార్ పంకజ్ జైన్ తెలిపారు. నాధూ సింగ్ మరణించాక ఈ వీలునామా అందుబాటులోకి రానుంది.