మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని కెమిస్ట్ భవనం లిఫ్టులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. రెండో అంతస్తునుంచి ఒక్కసారిగా లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్టులో ఆరుగురు వ్యక్తులున్నారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎలాంటి గాయాలు కాలేదు.. కెమిస్ట్ భవనంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పుట్టిన రోజు వేడుకల్లోపాల్గొని కిందకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
