కపుల్ ఫ్రెండ్లీ.. రొటీన్‌‌ లవ్ స్టోరీ కాదు

కపుల్ ఫ్రెండ్లీ..  రొటీన్‌‌ లవ్ స్టోరీ కాదు

మిస్ ఇండియా టైటిల్ గెలిచాక సినిమాలపై  ప్యాషన్‌‌తో  హీరోయిన్‌‌గా మారింది హైదరాబాదీ అమ్మాయి  మానస వారణాసి.  ఆమె హీరోయిన్‌‌గా  నటించిన రెండో చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్ హీరోగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.  ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ  ‘ఈ  చిత్రంలో మిత్ర అనే మిడిల్ క్లాస్‌‌ అమ్మాయిగా నటించా.

తను సరదా అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, అనుకున్నది వెంటనే చేసేస్తుంది.  డిగ్రీ చేసి జాబ్ కోసం చెన్నై వెళ్లిన ఆమెకు శివ (సంతోష్ శోభన్) పరిచయం అవుతాడు.  ఇద్దరి ప్రపంచాలు, లక్ష్యాలు వేరు. వీళ్లు  కలవడమే అరుదైన విషయం. రొటీన్ ప్రేమ కథలా ఉండదు.  లివింగ్ టుగెదర్ అనే  కాన్సెప్ట్‌‌ను కొత్తగా చూపిస్తున్నాం. యూత్‌‌తో పాటు  ఫ్యామిలీస్‌‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో స్టోరీస్ వింటున్నా.  యువతకు సందేశాన్నిచ్చే యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్స్ చేయాలని ఉంది’ అని చెప్పింది.