అందరికి నెగెటివ్‌‌‌‌ ..ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ

అందరికి నెగెటివ్‌‌‌‌ ..ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ

మాంచెస్టర్‌‌‌‌ / కోల్‌‌‌‌కతా: ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా టీమిండియా జూనియర్‌‌‌‌ ఫిజియో యోగేశ్‌‌‌‌ పర్మార్​ కొవిడ్‌‌‌‌ బారిన పడ్డాడు. దీంతో ఐదో టెస్ట్‌‌‌‌ జరగడంపై హైడ్రామా నెలకొంది. కరోనా కేసులు పెరిగితే కష్టమని భావించిన బీసీసీఐ మ్యాచ్‌‌‌‌ను క్యాన్సిల్‌‌‌‌ చేద్దామని ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ఇందుకు ఒప్పుకోలేదు. తమకు వాకోవర్‌‌‌‌ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టడంతో.. ఇండియన్‌‌‌‌ బోర్డు వెనక్కి తగ్గింది. చివరకు 21 మంది ఇండియన్‌‌‌‌ క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టుల్లో అందరికి నెగెటివ్‌‌‌‌ రావడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. చివరకు మ్యాచ్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే జరుగుతుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

అయితే కొవిడ్‌‌‌‌ భయంతో ఓ సీనియర్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. అతన్ని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. క్రికెటర్‌‌‌‌ ఫ్యామిలీ కూడా మ్యాచ్‌‌‌‌ ఆడాలని సూచించినా.. అతను ఫీల్డ్‌‌‌‌లోకి రావడానికి భయపడుతున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌‌‌‌ తర్వాత ఇంగ్లండ్‌‌‌‌, ఇండియా క్రికెటర్లు ఒకే ఫ్లైట్‌‌‌‌లో యూఏఈ వెళ్లాల్సి ఉండటం కూడా ఇరు దేశాల బోర్డులను ఆలోచనలో పడేసింది.

జడేజా, బుమ్రాకు రెస్ట్‌‌‌‌

ఒకవేళ షెడ్యూల్‌‌‌‌ ప్రకారం మ్యాచ్‌‌‌‌ జరిగితే.. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే చాన్స్‌‌‌‌ ఉంది. గత నెల రోజులుగా 151 ఓవర్లు బౌలింగ్‌‌‌‌ చేసిన బుమ్రాపై వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌ అధికంగా పడుతోంది. దీంతో అతనికి రెస్ట్‌‌‌‌ ఇచ్చి షమీకి చాన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు. కాలి కండరం నొప్పితో బాధపడుతున్న జడేజా ప్లేస్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా సీనియర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రెస్ట్‌‌‌‌ కోరుకుంటే సూర్యకుమార్‌‌‌‌, విహారిలో ఒకరు ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో రానున్నారు. అయితే ఫామ్‌‌‌‌లేమితో బాధపడుతున్న రహానెను ఏం చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. మరోవైపు ఫిజియోలిద్దరు ఐసోలేషన్‌‌‌‌లో ఉండటంతో.. ఓ ఫిజియోను అందుబాటులో ఉంచాలని ఈసీబీని బీసీసీఐ కోరింది. అయితే వెదర్‌‌ కండిషన్‌‌ ఇండియాకు అనుకూలంగా ఉండటం సానుకూలాంశం. ఫస్ట్‌‌ రెండు రోజులు వర్షం వల్ల మ్యాచ్‌‌కు అంతరాయం కలిగే చాన్స్‌‌ ఉంది. ఒకవేళ అదే జరిగి మ్యాచ్‌‌ డ్రా అయితే.. విరాట్‌‌సేన 2-1తో సిరీస్‌‌ను కైవసం చేసుకుంటుంది. దాంతో ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లండ్‌‌ (2021) పై సిరీస్‌‌లు గెలిచిన తొలి ఇండియన్‌‌ కెప్టెన్‌‌గా కింగ్‌‌ కోహ్లీ 
రికార్డులకెక్కుతాడు.