Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం(Adiparvam). కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి(Sanjeiv Megoti) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు. ఆదిత్య ఓం, ఏస్తర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డివోషనల్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉంటే.. ఆదిపర్వం ట్రైలర్ ఈవెంట్ లో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ లో భాగంగా మంచి లక్ష్మి మాట్లాడుతున్న సమయంలో తిరుపతికి చెందిన మంచు ఫ్యామిలీ అభిమాని ఒకరు నేరుగా స్టేజిపైకి పరిగెత్తుకుంటూ వచ్చి మంచు లక్ష్మి కాళ్లపై పడ్డాడు. ఆమెను కలిసినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆ అభిమాని భుజంపై చేయి వేసి ఓదార్చారు మంచి లక్ష్మి. అతనితో ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.