Manchu Manoj: సంగీత ప్రపంచంలోకి మంచు మనోజ్.. ‘మోహన రాగ మ్యూజిక్’ విశేషాలివే

Manchu Manoj: సంగీత ప్రపంచంలోకి మంచు మనోజ్.. ‘మోహన రాగ మ్యూజిక్’ విశేషాలివే

హీరోగా తనదైన గుర్తింపును దక్కించుకున్న మంచు మనోజ్ (Manchu Manoj) కొత్త జర్నీ ప్రారంభించాడు . నటుడిగా కొనసాగుతూనే సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ‘మోహన రాగ మ్యూజిక్’ (Mohana Raga Music)పేరుతో తన మ్యూజికల్ లేబుల్‌‌‌‌ను స్టార్ట్ చేశాడు.

లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్ అనే క్యాప్షన్‌‌‌‌తో మన సంగీతాన్ని వరల్డ్ వైడ్ రీచ్ చేసేందుకు తనదైన ప్రయత్నం చేయబోతున్నట్టు  శనివారం (2025 Nov 22న) సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశాడు మనోజ్. సంగీతం మీద తనకున్న ప్రేమే మోహన రాగ మ్యూజిక్ లేబుల్ స్థాపించేలా చేసిందని, ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్ లెస్ క్రియేటివిటీ తమ మ్యూజిక్ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తామని మంచు మనోజ్ తెలియజేశాడు.

మోహ‌‌‌‌న రాగ మ్యూజిక్ కంపెనీతో జ‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌బోయే అతి పెద్ద ఇంట‌‌‌‌ర్నేష‌‌‌‌న‌‌‌‌ల్ కొలాబరే ష‌‌‌‌న్ గురించి త్వరలోనే వెల్లడిస్తామన్నాడు. ఈ సందర్భంగా మంచు మనోజ్ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.