మంచు వివాదం పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ ఆఫీస్ కు చేరింది. మంచు మనోజ్ దంపతులు డీజీపీ జితేందర్ రెడ్డిని కలిశారు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై డీజీపీకి వివరించారు. తమకు రక్షణ కల్పించాలంటూ డీజీపీకి విజ్ఞప్తి చేశారు మనోజ్ దంపతులు.
మరోవైపు మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు మధ్య మంచు మనోజ్ సామాగ్రిని తరలిస్తున్నారు సిబ్బంది. మూడు వాహనాల్లో మనోజ్ సామాన్లను తరలించేందుకు ఏర్పాటు చేశారు.
మంచు ఫ్యామిలీ గొడవలు గత మూడు రోజులుగా సంచలనంగా మారాయి. డిసెంబర్ 9న మోహన్ బాబు,మనోజ్ పరస్పర ఫిర్యాదుతో ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. డిసెంబర్ 10న ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్హౌస్ దగ్గర మంచు మనోజ్ బౌన్సర్లకు, మరో వైపు విష్ణు బౌన్సర్లకు మధ్య గొడవ జరిగింది..
ALSO READ | Manchu family: మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు : ఫాంహౌస్ పని మనిషి
మరో వైపు డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మనోజ్ మీడియాకు చెప్పాడు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నార మనోజ్ మండిపడ్డాడు. న్యాయం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలను కలుస్తానని, తన భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం అని మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటి గుట్టు రట్టు చేసిన పనిమనిషి
మంచు ఫ్యామిలీ గొడవలపై మోహన్ బాబు ఫాంహౌస్ లో పనిచేసే మహిళ ఇంటి గుట్టును బయటపెట్టింది. మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవపడ్డారు.తండ్రీ కొడుకులు నెట్టుకున్నారు.. మనోజ్ కు దెబ్బలు తగల్లేదు. అసలు భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి ఎవరికీ ఇష్టం లేదు. మోహన్ బాబు మీద చేయిపడితే విష్ణు ఊరుకోడు. ఇద్దరి అన్నదమ్ముల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్థలు ఉన్నాయి.. అసలు ఈ గొడవకు కారణం వాళ్ల స్టాఫ్. మంచు లక్ష్మి వచ్చి నచ్చచెప్పారు. అని పనిమనిషి చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.