అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్. నందు విలన్‌గా నటిస్తున్నాడు. అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌ను హీరో మంచు మనోజ్ విడుదల చేసి సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ ‘నేను యాక్టర్ కావాలన్న మా నాన్న కల ఈ సినిమాతో నెరవేరింది. వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి పోరాటం చేశాడనేది ఈ సినిమా కథాంశం. కథలో మలుపులు తిరుగుతూ ఆడియెన్స్‌కు థ్రిల్ పంచుతుంది’ అని అన్నాడు.
నటులు శివాజీ రాజా, హర్ష, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, డీవోపీ సుజాత సిద్ధార్థ్ పాల్గొని సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ చిత్రంలో కోన వెంకట, సత్య, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
