Manchu Manoj, Mounika: తండ్రైన హీరో మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక

Manchu Manoj, Mounika: తండ్రైన హీరో మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక

టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) తండ్రయ్యారు. ఆయన సతీమణి భూమా మౌనిక(Bhuma Mounika) పండంటి పాపకు జన్మనిచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి(Manchu Lakshmi) సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. మనోజ్, మౌనిక తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లోకి దేవత కాలుపెట్టింది. మౌనిక పండంటి పాపకి జన్మనిచ్చింది. పాపకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టేశాము. ఆ పరమశివుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను.. అంటూ పోస్ట్ చేశారు లక్ష్మి.

ఈ పోస్ట్ చూసిన మంచు ఫ్యామిలీ అభిమానులు, నెటిజన్స్ మంచు మనోజ్, మౌనిక దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మహాలక్షి రాకతో మంచు వారింట పండుగ వాతావరణం నెలకొంది. ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటున్నారు.