Joram OTT: OTTకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Joram OTT: OTTకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయీ(Manoj Bajpayee) ప్రధాన పాత్రలో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ జోరమ్(Joram). దేవశిష్ మకీజా(Devashish Makija) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 8న థియేటర్స్ లో రిలీజై  మంచి విజయాన్ని సాధించింది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో రిలీజైన కొన్నిరోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మొన్నటివరకు రెంటల్ స్ట్రీమింగ్ ఆప్షన్ లో ఉంది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తరువాత ఏప్రిల్ 12 నుండి ఓటీటీలో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు.

దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి మనోజ్ బాజ్పాయ్ చేసే సినిమాలకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇప్పుడు జోరం సినిమా కోసం కూడా ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొతం చేసుకుంటుందో చూడాలి.

ఇక జోరం కథ విషయానికి వస్తే.. దాస్రు కర్కెట్టా అలియాజ్ బాలా(మనోజ్ బాజ్‌పాయీ).. తనను చంపాలని చూస్తున్న వారినుండి తపించుకొని తన బిడతో సహా పారిపోయి ముంబైలో తలదాచుకుంటాడు. అతనికి ఒక వైలెంట్ గతం కూడా ఉంటుంది. ఆ గతంలోని మనుషులు అతన్ని, తన ఫ్యామిలీని చంపాలని చేస్తారు. మరి వారి నుండి దాస్రు ఎలా తప్పించుకున్నాడు అనేది జోరం సినిమా కథ.