మంచు విష్ణుతో ప్రాణహాని ఉందన్న డైరెక్టర్

మంచు విష్ణుతో ప్రాణహాని ఉందన్న డైరెక్టర్

మంచు విష్టు  మోసం చేశారని ఆరోపించాడు ఓ దర్శకుడు. ఇందుకు గాను ‘ది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్’ కు లెటర్ రాశారు. గజ్జెల సైది రెడ్డి @ జి. కార్తిక్ రెడ్డి అనే దర్శకుడు ‘ఓటర్’ అనే సినిమాను మంచు విష్టును హీరోగా పెట్టి తెరకెక్కించాడు. ఈ సినిమాకు ‘రమా రీల్స్’ సంస్థ ప్రొడ్యూస్ చేసిందని తెలిపారు. షూటింగ్ మొదటి నుండి..సీన్ లను మార్చాల్సిందిగా విష్ణు తనను ఇబ్బంది పెట్టాడని కార్తిక్ రెడ్డి చెప్పారు. తన ప్రమేయం లేకుండా పలు సీన్లను కూడా షూట్ చేశారని అన్నారు. తీరా సినిమా ఫస్ట్ కాపీ వచ్చే సరికి తనకు కథ, స్క్రీన్ ప్లే హక్కులను ఇవ్వాల్సిందిగా బెదిరించారని చెప్పారు. కథ ఇవ్వడం కుదరదని.. స్క్రీన్ ప్లే మాత్రం ఇంచేందుకు అంగీకరిచానని అన్నారు.

సినిమా రిలీజ్ అయ్యేటైమ్ లో మార్కెట్ అయ్యాకనే రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ లు తెలిపారని దర్శకుడు కార్తిక్ రెడ్డి తెలిపారు. అయితే..ఈ విషయంలో.. మంచు విష్ణు ఇన్వాల్వ్ అయి.. ‘ఓటర్’ సినిమాను తన తండ్రి నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తో అడాప్ట్ చేసుకుని.. కథను రాసుకున్నట్లు బాండ్ పేపర్ మీద సైన్ చేయాలని బెదిరించాడని తెలిపారు కార్తిక్ రెడ్డి.  ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాను అడాప్ట్ చేసుకున్నందుకు కోటీ యాబై లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు బాండ్ పేపర్ పై ఉన్నదని చెప్పారు. అయితే ప్రొడ్యూసర్ లు సినిమాను రిలీజ్ చేయక పోతే.. బాండ్ పేపర్ ను చూయించి బ్లాక్ మేయిల్ చేస్తానని విష్ణు తనతో చెప్పారని కార్తిక్ రెడ్డి తెలిపారు. అయితే.. తాను అక్కడే ఉన్న బౌన్సర్ లను చూసి బయపడి బాండ్ పేపర్ లపై సంతకం పెట్టినట్లు చెప్పారు. ఈ వివాదం లో తనను మంచు విష్ణు బలవంతగా లాగారని చెప్పారు కార్తిక్ రెడ్డి. ‘ఓటర్’ కథ తన సొంతమని ఏ సినిమా నుంచి కూడా కాపీ చేయలేదని అన్నారు. తన ప్రాణానికి హాని ఉందని.. తనకు ఏమైనా అయితే అందుకు కారణం మంచు విష్ణు అని లెటర్ లో తెలిపారు.