మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప(Kannappa). మహాశివుడి పరామభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీల నుండి చాలా మంది స్టార్స్ నటించారు. ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శివరాజ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
తాజాగా కన్నప్ప టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే రెగ్యులర్ గా యూట్యూబ్ లో కాకుండా కేవలం కొన్ని థియేటర్స్ లో మాత్రమే ఈ టీజర్ విడుదల అయ్యింది. అందరు చూడటానికి వీలు లేకుండా పోయింది. దాంతో టీజర్ లోకి కొన్ని షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Eye Blink KI Response Choodandi Raa 🔥🔥🔥🔥🔥🔥#Prabhas #Kannappa pic.twitter.com/QB2Rs7mwqj
— 𝐑𝐚𝐣 𝐒𝐡𝐢𝐯𝐚 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 (@ImRajShiva) June 14, 2024
ఈ షాట్స్ తో ప్రెస్టీజియస్ కన్నప్ప సినిమాలో శివుడిగా ఎవరు కనిపించనున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. టీజర్ లో కనిపించిన లుక్స్ ప్రకారం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా నటించినట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఇక టీజర్ లో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించేలా చేసి ఆయన చేస్తున్న పాత్రపై సస్పెన్స్ ను కొనసాగించారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తు వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని సాధించేలా కనిపిస్తోంది. మరి కన్నప్ప ఫుల్ టీజర్ యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చూడాలి.