టాలీవుడ్ స్టార్ హీరోలపై రెచ్చిపోయిన మంచు విష్ణు

టాలీవుడ్ స్టార్ హీరోలపై రెచ్చిపోయిన మంచు విష్ణు

టాలీవుడ్ బడా హీరోలపై మా ప్రెసిడెంట్ మంచి విష్ణు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నలుగురైదుగురు బడా హీరోల వల్లే జనాలు థియేటర్స్ కు రావడం మానేసారని మండిపడ్డారు. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.." నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా నా పని నేను హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వెళుతున్నాను. ఎవరు ఏమనుకున్నా నాకవసరం. 

ఇక థియేటర్స్‌లో టికెట్ ధరలు కూడా 95 పర్సంట్ పెంచకూడదు. అలా పంచి జనాల దగ్గర ఎక్కువ  గుంజేయకూడదు. ఆ కారణంగానే చాలా మంది సినిమాలు చూడటం మానేశారు. కేవలం టికెట్ ధరల పెరుగుదలతోనే ప్రక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారు. తక్కువ టికెట్ రేటు ఉంటే.. నెలకు రెండు మూడు సినిమాలు అయినా చూసే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ రేట్స్ పెంచడానికి ఇండస్ట్రీలో నలుగురైదుగురు స్టార్ హీరోలే కారణం. వాల్ల వల్లే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇలా తయారయ్యింది. 

ఇక మా బిల్డింగ్ విషయానికొస్తే..  నటీనటులు ఎక్కువగా ఫిల్మ్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు. వారందరికీ అందుబాటులో ఉండేలా ఫిల్మ్ నగర్‌లో ‘మా’ బిల్డింగ్ కట్టేలా ప్లాన్ చేస్తున్నామంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంచి విష్ణు చేసన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనియ్యాంశం అయ్యాయి. మరి మంచు విష్ణు చేసిన కామెంట్స్ కు ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.