కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. రాజ్యాంగంపై భిన్న అభిప్రాయాలు ఉండచ్చు..కానీ రాజ్యాంగాన్ని మార్చాలనడం  దూరహంకారమన్నారు. దొరల రాజ్యాంగం తేవాలని చూస్తున్నారా? అని అన్నారు.  అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నచ్చని కేసీఆర్.. ఆయన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.రాజ్యాంగం వద్దన్నా కేసీఆర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదన్నారు.  కేసీఆర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి... ముక్కు నేలకు రాయాలన్నారు.  రేపు జరిగే రౌండ్ టేబుల్ మీటింగ్ లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

చిన్నజీయర్ స్వామి రూపంలో సమాజంలో సాంఘిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రామానుజచార్యుల విగ్రహ ఆవిష్కరణ తీరు చూస్తే  ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. 1000 ఏండ్ల క్రితం రామానుజచార్యులు సమానత్వం కోసం కృషి చేశారన్నారు. దళితులను, బడుగులను చేరదిసాడు కాబట్టే రామానుజచార్యులు సమతా మూర్తి అయ్యాడన్నారు. కానీ చిన జీయర్ స్వామి  రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేతలనా దగ్గరకు తీస్తున్నాడన్నారు. చిన్నజీయర్ స్వామి పారిశ్రామిక వేత్తలతో వ్యాపారం చేస్తున్నాడన్నారు. చిన్నజీయర్ స్వామి రామానుజల వారి నిజమైన శిష్యుడు కాదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తే.. చిన్న జీయర్ స్వామి సమానత్వ స్ఫూర్తిని పక్కన బెట్టాడన్నారు.  దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కాకుండా మోడీతో విగ్రహ ఆవిష్కరణ చేయించాడన్నారు. సమానత్వం పాటించని చిన్నజీయర్ స్వామి సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు చేశాడన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని దళిత, గిరిజన, బడుగు బలహీన సబ్బండ వర్ణాలతో తాము నిర్మించుకుంటామన్నారు.

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?