OTTలో రికార్డులు సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'మండల మర్డర్స్'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTTలో రికార్డులు సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'మండల మర్డర్స్'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'మండల మర్డర్స్' వెబ్ సిరీస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత 12 రోజులుగా టాప్ 10 టీవీ షోలను దాటి అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.  ఈ వెబ్ సిరీస్ గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సిరీస్ ప్లాట్ ఫామ్ లో కూడా చేరింది.  ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో పాతుకుపోయిన నమ్మకాలు, ఆచారాలతో రూపుదిద్దుకున్న ఈ 'మండల మర్డర్స్' వెబ్ సిరీస్  ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వారి మనస్సులకు బాగా కలెక్ట్ అయిందని దర్శకుడు గోపీ పుత్రన్ తెలిపారు. పురాణాన్ని కల్పనతో మిళితం చేయడం వల్ల  ప్రేక్షకులకు బలమైన ఆకర్షణ ఏర్పడిందని ఆయన అన్నారు. ఇది ప్రేక్షకుల ఊహాశక్తిని మరింత పెంచుతుంది.  చిన్ననాటి జ్ఞాపకాలను  గుర్తు చేస్తుంది. భారతదేశం ఒక పౌరాణిక ప్రదేశం. దీని నుండి ప్రేరణ పొందడానికి,  ప్రజలతో ప్రతిధ్వనించే కంటెంట్ ను సృష్టించడానికి మాకు చాలా సామర్థ్యం ఉంది. పౌరులుగా మనమందరం మన డీఎన్ఏలో ఉన్నట్లే దీనికి ఆకర్షితులయ్యామని భావిస్తున్నట్లు తెలిపారు..

మనం పెద్దయ్యాక పౌరాణికంగా,  దేశంలో జరిగిన సంఘటనల గురించి కథలు చెబుతుంటాం. అది మానసికంగా మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. కాబట్టి, మన మూలాలు,  నమ్మకం ,  సంస్కృతిలో భాగమైనప్పుడు  సరైన కంటెంట్ ను  సృష్టించగలిగినప్పుడు ప్రశంసలు , ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలమని తెలిపారు.

స్వతంత్రం వచ్చిన కొత్తలో 1952లో చరణ్‌దాస్‌పూర్‌ అనే గ్రామంలో రుక్మిణి అనే మంత్రగత్తె చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  ఈ ఊరిలో జరిగే వరుస హత్యల మిస్టరీని చేధించడం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు..  మనన్ రావత్ దర్శకత్వంలో వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'మండల మర్డర్స్' వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. దీనిలో వాణికపూర్, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియ పిల్గావ్కర్, సుర్వీన్ చావ్లా, సిద్ధాంత్ కపూర్ , రాహుల్ బగ్గా, రఘుబీర్ యాదవ్, మోనికా చౌదరి కీలక పాత్రల్లో నటించారు..