
- ఎం అండ్ ఎంకు రికార్డ్ లాభం
- 2022-23 లో రూ. 10,282 కోట్ల ప్రాఫిట్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: బిజినెస్‌లన్నీ మంచి పెర్ఫార్మెన్స్ చేయడంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం పెరిగి రూ.2,637 కోట్లకు చేరుకుంది. అదే 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,282 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీకి ఇదే అత్యధిక ఇయర్లీ ప్రాఫిట్ కావడం విశేషం. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.2,237 కోట్లు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,577 కోట్ల ప్రాఫిట్‌ను కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ఎం అండ్ ఎం రూ.32,366 కోట్ల రెవెన్యూ సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ.25,934 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీకి రూ.1,21,269 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.90,171 కోట్లుగా ఉంది. ఆటోమోటివ్ బిజినెస్ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 62 శాతం గ్రోత్ నమోదు చేసిందని, సప్లయ్ చెయిన్ మెరుగుపడడంతో ఈ సెగ్మెంట్ పెర్ఫార్మెన్స్ మెరుగయ్యిందని ఎం అండ్ ఎం పేర్కొంది. మహీంద్రా ఏసెలో 37 శాతం గ్రోత్ నమోదు చేయగా, మహీంద్రా లాజిస్టిక్స్ 24 శాతం, క్లబ్ మహీంద్రా 22 శాతం వృద్ధి చెందాయని వెల్లడించింది. 2022–23 మహీంద్రా గ్రూప్‌కు బ్లాక్ బస్టర్ ఇయర్ అని, రికార్డ్ లాంచ్‌లతో ఆటో సెగ్మెంట్ గ్రోత్‌ను ముందుండి నడిపిందని ఎం అండ్ ఎం ఎండీ అనిష్ షా పేర్కొన్నారు. లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్, ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ బిజినెస్‌లు కూడా కంపెనీ లీడర్‌షిప్ పొజిషన్‌ను బలపరుస్తున్నాయని అన్నారు. కాగా, 2022–23 లో కంపెనీ 6.98 లక్షల బండ్లను అమ్మింది..