పట్టాలు తప్పిన చెన్నై – మంగళూరు ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన చెన్నై – మంగళూరు ఎక్స్‌ప్రెస్

కేరళ: చెన్నై – మంగళూరు ఎక్స్‌ ప్రెస్ పట్టాలు తప్పింది. కేరళా రాష్ట్రంలోని షోరనూరు రైల్వేస్టేషన్‌ కు చేరుకుంటుండగా రైలులోని రెండు కోచ్‌ లు పట్టాలు తప్పాయి. రైలు నెమ్మదిగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి రైలు కోచ్‌ లను పట్టాలపైకి ఎక్కిస్తున్నారు.