మామిడితో మలై కుల్ఫీ... మండు వేసవిలో హోమ్ మేడ్ మ్యాంగో కుల్ఫీస్

మామిడితో మలై కుల్ఫీ... మండు వేసవిలో హోమ్ మేడ్ మ్యాంగో కుల్ఫీస్

ఈ వేసవిలో, సీజనల్ పండ్లుకు స్ట్రీట్స్ లో అమ్మే పానీయాలను కలిపితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా. ఐస్ క్రీం, తాండాయి లేదా కుల్ఫీలను ప్రతి సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సాధారణంగా, ఈ సమ్మర్ హీట్‌లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు నోరూరించే ఈ కుల్ఫీ అత్యంత ప్రజాదరణ పొందిన డెజర్ట్‌లలో ఒకటి. కేసర్ కుల్ఫీ అయినా, మలై కుల్ఫీ అయినా, మటక్ కుల్ఫీ అయినా, ప్రతి ఒక్కరూ ఈ క్రీమ్ డెజర్ట్‌ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు.  

 మీ పిల్లలకు ఇంట్లో చేసిన మలై కుల్ఫీతో ఈ వేసవిని మరింత సరదాగా మార్చండి...

టేస్టీ మలై కుల్ఫీ

కావలసినవి :

1. 2 కప్పుల పాలు
2. 1/4వ కప్పు మిల్క్ పౌడర్
3. 1/2 టీస్పూన్ ఏలకులు
4. పిస్తా, బాదం ముక్కలు
5. 3 టేబుల్ స్పూన్ల చక్కెర

ఎలా తయారు చేయాలంటే..

ముందుగా గ్యాస్ వెలిగించి, దానిపై ఒక గిన్నె పెట్టండి. అందులో పాలు పోసి, ఏలకులు, బాదం, పిస్తా ముక్కలు, మిల్క్ పౌడర్ వేసి బాగా కలపండి. అలా వాటిని చిన్న మంటపై 20-25 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గ్యాస్ ఆపేసి మిశ్రమాన్ని చల్లబరచండి. దీన్ని 4 వేర్వేరు కుల్ఫీ మౌల్డ్‌లలో ఉంచండి. వీటిని 7-8 గంటలు ఫ్రీజర్‌లో ఉంచండి. ఆ తరువాత, ఫ్రీజ్ నుంచి తీసి కొంత సమయం పాటు బయట ఉంచండి. కుల్ఫీ అచ్చు నుండి కుల్ఫీని తీసి, దానిని కట్ చేసి సర్వ్ చేయండి.

https://www.instagram.com/p/CrH3zzgpp02/?utm_source=ig_embed&ig_rid=992a11a6-caef-4862-bb64-667eaa7ad4de

మ్యాంగో కుల్ఫీ

కావలసినవి:

మామిడి పండు గుజ్జు 2 కప్పులు
మిల్క్ పౌడర్ 1 కప్పు
మిల్క్ మెయిడ్ 1 కప్పు (400 గ్రాములు)
అలంకరించడం కోసం తరిగిన పిస్తాపప్పులు
బాదంపప్పులు

ఎలా తయారు చేయాలంటే..

దశ 1: నాన్-స్టిక్ పాన్‌లో ½ కప్పు నీటిని వేడి చేయండి. అందులో పాలపొడి వేసి బాగా గిలకొట్టాలి.

2వ దశ: మిల్క్‌మెయిడ్‌ని జోడించి, మామిడిపండు గుజ్జు వేసి కలిపి, 1 నిమిషం ఉడికించాలి.

దశ 3: మంట నుంచి మిశ్రమాన్ని వేరు చేసి, చల్లబర్చాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి, మూతపెట్టి, రాత్రి ఫ్రీజ్ లో పెట్టండి.

దశ 4: కుల్ఫీని ఫ్రీజ్ నుంచి బయటకు తీసి, గానికి కట్ చేయండి. తరిగిన పిస్తా, బాదంపప్పులతో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేస్తే.. టేస్టీ మ్యాంగో కుల్ఫీ రెడీ.

https://www.instagram.com/p/Cre6z3MOLJC/?utm_source=ig_embed&ig_rid=4c73a407-01ff-45f2-9653-9fa7c5a8aef9