ప్రియాంకపై మ్యాన్‌‌‌‌‌‌‌‌హ్యాండ్లింగ్.. వివరణ కోరిన ఎన్సీడబ్ల్యూ

ప్రియాంకపై మ్యాన్‌‌‌‌‌‌‌‌హ్యాండ్లింగ్.. వివరణ కోరిన ఎన్సీడబ్ల్యూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై మ్యాన్ హ్యాండ్లింగ్ సంఘటనను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్​గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని యూపీ పోలీసులను ఆదేశించింది. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంకను యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ టైమ్​లో ఓ పోలీస్ ప్రియాంక కుర్తాను పట్టుకున్నాడు. ‘‘ప్రియాంక గాంధీపై మ్యాన్ హ్యాండ్లింగ్​ను ఖండిస్తున్నాం. దీనిపై వివరణ ఇవ్వాలని యూపీ డీజీపీని ఆదేశించాం” అని ఎన్సీడబ్ల్యూ సోమవారం ట్వీట్ చేసింది.