
‘జాతి రత్నాలు’చిత్రంతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ‘అనగనగా ఒకరాజు’సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత నవీన్ ఓ క్రేజీ కాంబోతో సర్‌ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం డైరెక్షన్‌లో ఒక్కసారైనా నటించాలని ఎంతోమంది స్టార్స్ కోరుకుంటారు.
అలాంటి చాన్సే నవీన్ అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’రూపొందించిన మణిరత్నం.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత ఆయనొక అందమైన లవ్‌స్టోరీని సిద్ధం చేశారట.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాలుగు కీలకమైన పాత్రలుండగా.. ఇప్పటికే ఓ పాత్ర కోసం శింబును ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది.సెకండ్ లీడ్ కోసం నవీన్‌ను తీసుకున్నారనే న్యూస్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
నవీన్‌కు ఉన్న యూత్ ఫాలోయింగ్‌కి సరైన లవ్ స్టోరీ పడితే తన కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుందని, మణిరత్నం సినిమాతోనే ఆ చాన్స్ ఉందని తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
►ALSO READ | Manoj Manchu: స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్.. కట్టుబట్టలతో రోడ్డుపై పెట్టేశారు.. కార్లు లాగేసుకున్నారు
అలాగే మరో ఇంట్రెస్టింగ్ కాంబో తెలుగు, తమిళ సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతోంది. అదే మన సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబో. సరిపోదా శనివారం మూవీతో వందకోట్ల బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ రజినీతో ఓ మూవీ చేయనున్నాడట. ఒక సాలిడ్ స్టోరీని రజినీకి వినిపించారట.
ఆత్రేయ చెప్పిన స్టోరీ లైన్కు రజినీ ఫిదా అవ్వడంతో పాటు వెంటనే పట్టాలెక్కించాలని చెప్పినట్టు సమాచారం. ఈ క్రేజీ కాంబోని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేసినట్లు టాక్. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఇప్పటి వరకు లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబోస్ ను ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.మరి నిజమవుతాయా లేదా అనేది మరికొన్ని రోజులలో తెలిసే అవకాశం ఉంది.