మరోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా

 మరోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా జరిగిన శాసనసభపక్ష నేతగా ఆయన్ను  ఎమ్మెల్యేలు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సాహా నేడు త్రిపుర గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. దీంతో రెండోసారి మాణిక్ సాహా  త్రిపుర సీఎం పీఠాన్ని అదిష్టించనున్నారు. మార్చి 8 న సాహా  ప్రమాణస్వీకారం ఉండనుంది. కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మార్చి 8న జరగనుంది. 

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొననున్నారు.  ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆదివాసీలకు చెందిన తిప్రా మోత పార్టీ తొలిరోజు 42 స్థానాల్లో పోటీ చేసి 13 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  సీపీఎం 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించింది.


2016లో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన  మాణిక్ సాహాను  త్రిపుర ఎన్నికలకు 10 నెలల ముందు సీఎంగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు బిప్లబ్ కుమార్ దేబ్ సీఎంగా ఉన్నారు.