చెరుకు సుధాకర్ తో మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక భేటీ

చెరుకు సుధాకర్ తో మాణిక్కం ఠాగూర్  ప్రత్యేక భేటీ

మునుగోడు బైపోల్ పై  కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.  గాంధీభవన్ లో  ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్ల సమావేశం జరగనుంది. మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు. ఇప్పటికే టికెట్ ఆశావహులతో గాంధీభవన్ లో AICC నేత బోసురాజు సమావేశం నిర్వహించారు. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతతో మాట్లాడారు.

మరోవైపు ఇవాళ హైదర్ గౌడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చెరుకు సుధాకర్ తో  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సమావేశం అయ్యారు.  చెరుకు సుధాకర్ ఒక్కరినే పిలిచి  మాట్లాడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  చల్లమల్ల కృష్ణారెడ్డితో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు.జానారెడ్డితోనూ మాణిక్కం ఠాగూర్ ప్రత్యేకంగా మాట్లాడారు.