
పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మధురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్‌పై కూర్చున్న ఈ ఫొటోను మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో షేర్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని, తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్లు ఇలా బెంచ్‌పై కూర్చోవాల్సి వచ్చిందన్నారు.