సిసోడియాను.. జైల్లోనే అరెస్ట్ చేసిన ఈడీ

సిసోడియాను.. జైల్లోనే అరెస్ట్ చేసిన ఈడీ

ఆప్ కీలక నేత.. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లోనే ఉన్న ఆయన్ను.. అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కదా అనే డౌట్ రావొచ్చు.. మొన్న అరెస్ట్ చేసింది సీబీఐ.. వాళ్లు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో డబ్బుల లావాదేవీల అంశంలో విచారణ చేస్తున్న ఈడీ.. తన పరిధిలోని కేసు విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడు రోజులుగా తీహార్ జైల్లోనే విచారణ చేస్తుంది ఈడీ. మార్చి 9వ తేదీ ఉదయం 45 నిమిషాలపాటు విచారించారు అధికారులు. లిక్కర్ స్కాంలో డబ్బులు ఎలా చేతులు మారాయి.. ఎవరెవరి దగ్గర నుంచి ఏ రూపంలో వచ్చాయి అనే విషయాలపై ఆరా తీశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు.. ఇప్పటికే అరెస్ట్ అయిన 11 మంది నిందితులతోపాటు.. 11వ తేదీన విచారణ చేయబోతున్న ఎమ్మెల్సీ కవిత కలిపి విచారణ చేయటానికి అనుగుణంగానే ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తీహార్ జైల్లోనే ఉన్న  సిసోడియాను తమ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటీషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. 

లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 27వ తేదీన సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ కేసులోనే ఆయన ఇప్పటికే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మార్చి 10వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ విచారణకు వస్తున్న కొన్ని గంటల ముందే.. సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయటం కేసులో కొత్త ట్విస్ట్