లిక్కర్ స్కామ్లో సిసోడియానే ప్రధాన సూత్రధారి : ఈడీ

 లిక్కర్ స్కామ్లో  సిసోడియానే ప్రధాన సూత్రధారి : ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన  మనీష్ సిసోడియా బెయిల్ ఫిటిషన్ పై రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.  బెయిల్ ఫిటిషన్ పై మార్చి 21న విచారిస్తామని కోర్టు ప్రకటించింది. మార్చి 21 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు  రూస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మరోవైపు 10రోజుల కస్టడీకి అప్పగించాలన్న ఈడీ ఫిటిషన్ ను కోర్టు రిజర్వ్ చేసింది. దీనిపై మార్చి 21న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిసోడియానే  ప్రధాన సూత్రధారినని ఈడీ కోర్టుకుతెలిపింది. ఈ కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందని తెలిపింది. ఇందుకోసం 10 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. ఈడీ వాదనను సిసోడియా లాయర్ ఖండించారు. సిసోడియా ఇంట్లో గతంలో తనిఖిలు చేస్తే ఏమీ దొరకలేదని చెప్పారు. సిసోడియా  స్కామ్ లో ఉన్నట్టుగా ఏ ఒక్క ఆధారం లేదని వాదించారు.

సీబీఐ ఆరెస్ట్ పై బెయిల్ ఇచ్చే టైమ్ లో కావాలనే ఈడీ ఆరెస్ట్ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. సిసోడియా తరుపున విజయ్ నాయర్ అన్ని తానై వ్యవహారించాడని ఈడీ  కోర్టుకు తెలిపింది.  విజయ్ నాయర్, సిసోడియా, కవితతో పాటు పలువురు ఈ కుట్రలో భాగం అయినట్లు ఈడీ తరుపు లాయర్ కోర్టులో వాదించారు.