సీబీఐ విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం

సీబీఐ విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం

నేడు సీబీఐ విచారణకు మనీష్ సిసోడఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురుని ఆరెస్ట్ చేసిన సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) .. తాజాగా దర్యాప్తును మరింతగా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారణకు పిలిచింది.  ఉదయం 11 గంటలకు ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని సిసోడియా ట్విట్టర్ లో తన  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. "ఈరోజు సీబీఐ కార్యలయానికి వెళ్లి విచారణకు పూర్తిగా సహకరిస్తా.. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి.. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను. దేశం కోసం ఉరితీసిన భగత్ సింగ్ అనుచరుడిని నేను ’’ అని సిసోడియా ట్వీట్ చేశారు. కాగా గత ఆదివారం సిసోడియాకు సీబీఐ నుంచి సమన్లు అందాయి. మరి విచారణలో సిసోడియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగనున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ అనంతరం సీబీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.