జూలై 6 వరకు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

 జూలై 6 వరకు  మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని  జూలై 6 వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు.  లిక్కర్ స్కాం సీబీఐ  కేసులో అనుబంధ చార్జ్ షీట్ పై  రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనీష్ సిసోడియాను కోర్టు విచారణకు హాజరయ్యారు. మనీష్ సిసోడియాను వీసీ ద్వారా లోకప్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్బంగా నిందితులకు చార్జిషీటు కాపీ, సంబంధిత పత్రాల కాపీని ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

మనీష్‌ సిసోడియా, బుచ్చిబాబు గోరంట్ల, అర్జున్‌ పాండే, అమన్‌దీప్‌ దాల్‌లను నిందితులుగా సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.. మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధల్‌లకు  మే 27న  రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే  ఈ రోజు  కేసులో నిందితుడైన అర్జున్ పాండే   కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.  మనీష్ సిసోడియాకు చెందిన ఇద్దరు న్యాయవాదులు, అతని స్నేహితులలో ఒకరిని రౌస్ అవెన్యూ కోర్టు లాకప్‌లో కలవడానికి కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను  జూలై 6 కి వాయిదా వేసింది.