‘మణిశంకర్’ మూవీ సంఘటన చుట్టూ జరిగే కథ

‘మణిశంకర్’ మూవీ సంఘటన చుట్టూ జరిగే కథ

శివ కంఠమనేని, సంజ‌‌‌‌న గ‌‌‌‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌‌‌‌క్య ప్రధానపాత్రల్లో జి.వెంకట కృష్ణ రూపొందించిన చిత్రం ‘మణిశంకర్’. కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీ‌‌‌‌నివాస‌‌‌‌రావు, ఎం.ఫణిభూషణ్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రెస్‌‌‌‌ మీట్ నిర్వహించారు. శివ మాట్లాడుతూ ‘ఒక సంఘటన చుట్టూ తిరిగే కథ ఇది.

ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆసక్తి రేపుతుంది. జనవరి ఫస్ట్ వీక్‌‌‌‌లో రిలీజ్‌‌‌‌ చేయబోతున్నాం’ అన్నారు. సంజన మాట్లాడుతూ ‘శివ గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. అలాగే మా నిర్మాతలు చక్కటి ప్లానింగ్‌‌‌‌తో సినిమాను నిర్మించారు’ అని చెప్పింది. ‘ఇందులో హీరోలు, విలన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి’ అన్నాడు దర్శకుడు.