మళయాళ ఇండస్ట్రీలో ఈ మధ్య విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys). దర్శకుడు చిదంబరం(Chidambaram) తెరకెక్కించిన ఈ సినిమా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్య విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ క్రియేట్ అయ్యింది.
ఆ క్రేజ్ తోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమా తెలుగులో ఏప్రిల్ 6న విడుదలయ్యింది. ఇందులో భాగంగా మంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు చిదంబరం తెలుగు సినిమాల గురించి, ఇక్కడి స్టార్ హీరోల గురుంచి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. నాకు తెలుగు సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ, నా జనరేషన్ లో మాత్రం అల్లు అర్జున్ సినిమా వల్ల తెలుగు సినిమాల గురించి తెలిసింది. ఆయన సినిమాలన్నీ మలయాళంలో రిలీజై మంచి విజయాలు సాధించాయి. కాబట్టి.. అల్లు అర్జున్ వల్లే తెలుగు సినిమాలకు అక్కడ క్రేజ్ పెరిగింది.. అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు చిదంబరం. దీంతో చిదంబరం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మంజుమ్మల్ బాయ్స్ సినిమా విషయానికి వస్తే.. సర్వైకల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. కేరళలోని గుణ గుహల బ్యాక్డ్రాప్ లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. కొంతమంది స్నేహితులు కలిసి గుణ గుహలకు ట్రెక్కింగ్ కి వెళ్తారు. ప్రమాదాశాత్తు వారిలో ఒక వ్యక్తి లోయలో పడిపోతారు. తమ స్నేహితుడిని కాపాడటం కోసం మిగతా వారు చేసిన సాహసమే ఈ సినిమా.