మనోజ్ తివారీ సూపర్‌ సెంచరీ

మనోజ్ తివారీ సూపర్‌ సెంచరీ

జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. 152 బంతులు ఎదుర్కొన్న అతను14 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సెంచరీ చేశాడు.  బెంగాల్ తరఫున ఆడిన తివారీ 136 పరుగులు చేసి వెనుదిరిగాడు. మంత్రి అయిన తర్వాత తివారీకి అతని మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీ.  ఓవారల్ గా అతనికి 28వ ఫస్ట్-క్లాస్ సెంచరీ.  కాగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్‌ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇక 36 ఏళ్ల తివారీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతను బీజేపీ అభ్యర్ధి రతిన్ చక్రవర్తిని ఓడించాడు.  ప్రస్తుతం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంలో  క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నాడు.