
లిక్కర్, కల్లుకు బానిసైనవారు అది దొరక్క పోవడంతో కొందరు వింతగా ప్రవర్తిస్తుండగా .. మరి కొందరు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడటంలేదు. దేశంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వైన్ షాపులు అక్కడే బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో మందు బాబులకు నోరు కట్టేసినట్లైంది. మద్యానికి బానిసైన వాళ్లకు సాయంత్రానికి చుక్క పడకపోతే తట్టుకోలేరని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే సంఘటన జరిగింది. ప్రముఖ దివంగత నటి మనోరమ కొడుకు భూపతి కూడా నిద్రమాత్రలు మింగాడని స్థానిక మీడియా ఛానళ్లలో హల్ చల్ చేస్తుంది. మద్యానికి బానిసైన అతడు.. లిక్కర్ దొరక్క పోవడంతో నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని డాక్టర్ వద్దని తీసుకెళ్లి చికిత్స అందించారని.. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.