కమలాపురం వద్ద .. రూ 6.50 లక్షల నగదు స్వాధీనం

కమలాపురం వద్ద .. రూ 6.50 లక్షల నగదు స్వాధీనం

మణుగూరు, వెలుగు : ఆధారాల్లేని రూ 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ సతీశ్ ​కుమార్ తెలిపారు. పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశామని చెప్పారు.

మణుగూరుకు చెందిన కోటా వెంకట అప్పారావు అనే వ్యక్తి నుంచి రూ 1.50 లక్షలు, అదే ప్రాంతానికి చెందిన ఇట్ట పుల్లారావు వద్ద నుంచి రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న నగదును ఎలక్షన్ ఎఫ్ఎస్ టీకి అప్పగించామని సీఐ తెలిపారు.