సరైన నిద్రపోతే చాలారకాల హెల్త్‌‌ బెనిఫిట్స్‌

సరైన నిద్రపోతే చాలారకాల హెల్త్‌‌ బెనిఫిట్స్‌

ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. సరిపోను నిద్రలేకపోతే శరీరం యాక్టివ్‌‌గా ఉండదు. నిద్ర పట్టకపోవడానికి  కారణాలేంటో చూసుకోవాలి. అవి సరిచూసుకొని సరైన నిద్రపోతే చాలారకాల హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ ఉంటాయి.   వెల్లకిలా పడుకొని, చేతులు నిటారుగా చాపాలి. దీన్నే ‘సోల్జర్ పోశ్చర్‌‌‌‌’ అంటారు.  ఇలా పడుకోవడం వల్ల వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. గూని పోతుంది. అంతేకాకుండా యాసిడ్‌‌ రిఫ్లెక్స్‌‌ను తగ్గిస్తుంది. ముఖం పైన ముడతలు రానీయదు. నుదిటిమీద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకుంటే  వెన్ను, మెడ నొప్పులు పోతాయి. తిన్న ఆహారం కడుపులోనుంచి అన్నవాహికలోకి రాకుండా ఉంటుంది. దీన్నే ‘స్టార్‌‌‌‌ ఫిష్​ పొజిషన్‌‌’ అంటారు. గురక, చిరాకు, యాసిడ్‌‌ రిఫ్లెక్స్‌‌ పోవడానికి, అల్జీమర్స్‌‌, పార్కిన్సన్‌‌ లాంటి మెదడు వ్యాధులు రాకుండా ఉండటానికి.. ఒక పక్కకు తిరిగి, కాళ్లు కొంచెం వంచి, చేతులు పక్కకు చాచి నిద్రపోవాలి.ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకోవడం వల్ల యాసిడ్‌‌ రిఫ్లెక్స్‌‌, గురక, స్లీప్ ఆప్నియా, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉంటే పోతాయి.  గర్భిణులు ఇలా పడుకుంటే పిండానికి బ్లడ్‌‌ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.