కాంగ్రెస్ లో డబుల్ టికెట్ల లొల్లి.. రెండు టికెట్లు ఆశిస్తున్నది వీళ్లే

కాంగ్రెస్ లో డబుల్ టికెట్ల లొల్లి.. రెండు టికెట్లు ఆశిస్తున్నది వీళ్లే

రెండు టికెట్ల అభ్యర్థన కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాత, కొత్త నాయకులు ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టికెట్లు అడుగుతుండటం గమనార్హం.  అలా టికెట్లు ఆశిస్తున్న వారిలో  మాజీ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి  ఉన్నారు. కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో 5 ఏండ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్న వారి ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్ కేటాయించాలి. ఒక్కో ఫ్యామిలీకి రెండేసి టికెట్లు కేటాయించడం వల్ల  ఆ సెగ్మెంట్ లో తాము అవకాశాలు కోల్పోతున్నామని మిగతా నేతలు  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న నేతలు కూడా ఫ్యామిలీ ప్యాక్ అడుగుతుండటం గమనార్హం. ఈ సెగ్మెంట్లలో టికెట్ల కేటాయింపు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే పార్టీకి నష్టం జరుగుతుందనే భయం వెంటాడుతోంది.

 డబుల్ టికెట్లు ఆశిస్తున్న నేతలు

  • ఉత్తమ్ కుమార్ రెడ్డి (భార్యభర్తలకు)
  • జానారెడ్డి (తండ్రీ కొడుకులు)
  • దామోదర రాజనర్సింహా ( తండ్రీ కూతుళ్లు)
  •  బలరాం నాయక్ ( తండ్రీ కొడుకు)
  •  సీతక్క ( తల్లీ కూతుళ్లకు)
  •  కొండా సురేఖ ( భార్యభర్తలకు)
  • అంజన్ కుమార్ యాదవ్ ( తన ఇద్దరు కొడుకులకు)
  •  రేఖా నాయక్ ( భార్యాభర్తలకు)
  • మైనంపల్లి హన్మంతరావు ( తండ్రీ కొడుకులకు)