కోరుట్ల పట్టణంలో గుడిసెల కోసం నిరుపేదల పోరాటం

కోరుట్ల పట్టణంలో గుడిసెల కోసం నిరుపేదల పోరాటం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంగెం రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో మరోసారి చీరలతో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు పలువురు మహిళలు. సీపీఎం ఆధ్వర్యంలో గత 50 రోజులుగా గుడిసెల కోసం స్థానిక నిరుపేదలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మే 29వ తేదీన పలువురిని అరెస్టు చేసి.. బలవంతంగా గుడిసెలను తొలగించారు పోలీసులు. అధికారులు చదును చేసిన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి..లక్కీ డీప్ ద్వారా మహిళలకు సీపీఎం నేతలు ఇండ్ల స్థలాలను కేటాయించారు. దీంతో మే 30న మరోసారి నిరపేదలు చీరలతో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు.