మన్యంకొండ బ్రహ్మోత్సవాలు షురూ

మన్యంకొండ బ్రహ్మోత్సవాలు షురూ
  • మొదటి రోజు వెంకన్నకు గజవాహన సేవ

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పేదల తిరపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోట కదరా గ్రామంలోని అలహరి వంశస్తుల నివాసం నుంచి మన్యంకొండ దేవస్థానానికి పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నృత్యాలతో ఊరేగింపు సాగింది. 

అనంతరం అలివేలు మంగతాయారు పద్మావతి సమేతంగా వేంకటేశ్వర స్వామిని గజవాహనంపై హనుమద్దాసుల మండపంలో అలంకరించి పల్లకిలో గర్భాలయ మెట్ల దారి గుండా తేరు మైదానం వరకు ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు దర్శనానంతరం స్వామివారిని గర్భాలయానికి తీసుకెళ్లారు. ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో గోవిందరాజు, సూపరింటెండెంట్  నిత్యానంద చారి, లైబ్రరీ చైర్మన్  మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు