క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ అంపైర్

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ అంపైర్

క్రికెట్ లోకి ఎంతోమంది అంపైర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ కొంతమంది మంది తమ అంపైరింగ్ తో చరిత్రలో నిలిచిపోతారు. అందులో ప్రధాన వరుసలో నిలిచేది మరైస్ ఎరాస్మస్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ వెటరన్ అంపైర్ మరైస్ తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ తనకు చివరిదని వెల్లడించాడు. 

 అంతర్జాతీయ క్రికెట్ అంపైరింగ్‌లో ఎరాస్మస్ ప్రయాణం గొప్పగా సాగింది. ఫిబ్రవరి 2006లో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ  క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా అతని అంపైరింగ్ చేశాడు. తన అంపైర్ కెరీర్ లో మొత్తం 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20 లు ఉన్నాయి. నేను క్రికెట్ నుంచి నా గొప్ప ప్రయాణాన్ని వేదిలేస్తున్నాను. కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అని క్రిక్ బజ్ తో వెల్లడించాడు. తన కెరీర్‌ లో దిగ్గజ ఆటగాళ్లను చూసే అవకాశం వచ్చినందుకు కీలక సమయాల్లో తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. 

also read : దుబాయ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో బోపన్న జోడీ

క్రికెట్‌కు ఎరాస్మస్ చేసిన కృషి కేవలం మైదానానికే పరిమితం కాలేదు. మైదానం వెలుపల అతను అప్ కమింగ్ అంపైర్‌లకు మెంటార్‌గా ఉండాలని.. రిటైర్మెంట్ తర్వాత దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్‌లో అధికారిగా వ్యవహరించాలని అతను తెలిపాడు. అతని నిర్ణయం ద్వారా ఆట పట్ల అతని అంకితభావం స్పష్టంగా కనిపించింది. ఎరాస్మస్ ఐసిసి అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా మూడుసార్లు విజేతగా నిలిచాడు.