వాచీ 8కోట్లా... అనంత్ అంబానీ వాచీని చూసి షాకైన జుకర్ బర్గ్..!

వాచీ 8కోట్లా... అనంత్ అంబానీ వాచీని చూసి షాకైన జుకర్ బర్గ్..!

అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అనంత్ చేతికి ధరించిన 8కోట్ల రూపాయల విలువైన వాచీని చూసి జుకర్ బర్గ్ షాకయ్యాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సాధారణంగా ఒక టీషర్ట్, జీన్స్ తో సింపుల్ గా కనిపించే జుకర్ బర్గ్ ఈ వేడుక కోసం డిజైనర్ దుస్తులు ధరించాడు.

భార్య ప్రిసిల్లా చాన్ తో కలిసి అనంత్ అంబానితో కలిసి మిముచ్చటిస్తున్న సమయంలో జుకర్ బర్గ్ భార్య అనంత్ వాచీ చాలా బాగుందని జుకర్ బర్గ్ కి చెబుతుంది. అప్పుడు జుకర్ బర్గ్, అవును నేను కూడా ఇందాక అదే చెప్పాను అంటాడు. ఇది రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచీ అని ప్రిసిల్లాకు చెబుతాడు అనంత్ అంబానీ.ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

అయితే, అనంత్ ఆదరించిన వాచీ బ్రాండ్ గురించి, దాని ధర గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచీలు 80వేల డాలర్ల నుండి మొదలై 1 మిలియన్ డాలర్ల వరకూ ఉంటాయని తెలుస్తోంది. 1మిలియన్ డాలర్లు అంటే సుమారు 8కోట్ల రూపాయలు.