మొదటి రోజు మార్కెట్ డల్‌‌‌‌

మొదటి రోజు మార్కెట్ డల్‌‌‌‌

ముంబై : కొత్త సంవత్సరాన్ని మార్కెట్‌‌‌‌ డల్‌‌‌‌గా ఓపెన్ చేసింది. 2024 లో మొదటి రోజైన సోమవారం ఫ్లాట్‌‌‌‌గా కదిలింది. సెన్సెక్స్‌‌‌‌ 32 పాయింట్ల లాభంతో 72,272 దగ్గర, నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 21,742  వద్ద సెటిలయ్యాయి. ఇన్వెస్టర్ల దృష్టి ఫెడ్ మినిట్స్‌‌‌‌ (ఈ నెల 4 న) పై ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు.

సెన్సెక్స్‌‌‌‌లో నెస్లే, టెక్‌‌‌‌ మహీంద్రా, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌, టాటా మోటార్స్‌‌‌‌, విప్రో, ఐటీసీ షేర్లు  ఎక్కువగా లాభపడ్డాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్‌‌‌‌ ఫిన్సర్వ్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ  బ్యాంక్‌‌‌‌, ఎన్‌‌‌‌టీపీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు పడ్డాయి. మిడ్‌‌‌‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌గా కదిలాయి.