Viral Video: పెళ్లి కూతురు వింత కోరిక : గడ్డ కట్టే చలిలో పెళ్లి

Viral Video: పెళ్లి కూతురు  వింత కోరిక : గడ్డ కట్టే చలిలో పెళ్లి

ఓ పెళ్లి వేడుక ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.  ఈ రోజుల్లో పెళ్లిళ్లు గమ్మత్తుగా.. కొత్త కొత్త వింత పోకడలతో జరుగుతున్నాయి.  పెళ్లి కార్డుల నుంచి విందు.. గిఫ్ట్ ల వరకు  నానా హంగామా చేస్తున్నారు.  తాజాగా జరిగిన పెళ్లి వేడుక విషయంలో పెళ్లి కూతురు వింత కోరిక కోరింది. ఓ పెళ్లి వేడుక ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.  ఈ రోజుల్లో పెళ్లిళ్లు గమ్మత్తుగా.. కొత్త కొత్త వింత పోకడలతో జరుగుతున్నాయి.  పెళ్లి కార్డుల నుంచి విందు.. గిఫ్ట్ ల వరకు  నానా హంగామా చేస్తున్నారు.  తాజాగా జరిగిన పెళ్లి వేడుక విషయంలో పెళ్లి కూతురు వింత కోరిక కోరింది.  గడ్డ కట్టే చలిలో పెళ్లి జరగాలని కోరడంతో వరుడు  ఒప్పుకున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ అయింది. 

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే గొప్ప వేడుక.. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కొత్తగా, గమ్మత్తుగా ఉంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలోని మంచుతో కప్పబడిన పర్వతాలు  పెళ్లి వేదికగా  మారాయి.  వివాహాన్ని ప్రత్యేకంగా, ఒక మధురమైన జ్ఞాపకంగా అందరికీ గుర్తుండిపోయేలా చేయడానికి కొన్ని విపరీతమైన ఆలోచనలు చేస్తుంటారు కొందరు వధూవరులు. చాలా మంది తమ వివాహం కోసం వివిధ రకాల కలలు కంటారు. ప్రతి ఒక్కరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటారు. 

పెళ్లి చేసుకోవాలని ఓ జంట చేసిన క్రేజీ ఐడియా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. గుజరాత్‌కు చెందిన ఓ జంట తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలోని మంచుతో కప్పబడిన పర్వతాలను ఎంచుకుంది. ఈ ప్రదేశం ఎముకలు కొరికే చలితో నిండిఉంటుంది. ఈ జంట మురాంగ్, స్పితిలో తమ వివాహ మండపాన్ని ఏర్పాటు చేయించారు.. ఈ ప్రాంతంలో ఇదే తొలి కళ్యాణ మండపం. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఎముకలు కొరికే చలి, మంచు కురుస్తున్న ప్రాంతంలో ఓ జంట పెళ్లి చేసుకుంటున్న వీడియో ఇది. వధువు కోరిక మేరకు మంచులో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఈ జంట మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పెళ్లి కోసం పెద్ద సాహసమే చేశారు. మంచులోనే పెళ్లి మండపం ఏర్పాటు చేసుకున్నారు. చలిలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. తక్కువ మంది బంధుమిత్రులు, పురోహితుడు ఉన్నారు. గడ్డ కట్టుకుపోయే చలిలోనే ఏడడుగులు వేశారు నూతన వధూవరులు. అక్కడే సంతోషంగా మిత్రులు, బంధువులు ఇచ్చిన కానుకలను అందుకున్నారు. ఇలాంటి పెళ్లి వేడుకను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కాగా, ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

హిమాచల్ ప్రభుత్వంలోని అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్ షేర్ చేసిన ఈ వీడియో ఉత్కంఠభరితమైన వీక్షణల మధ్య ఇలాంటి వాటిలో ఒకటి’ పెళ్లిని సంగ్రహించింది.ఆ వీడియో మొదట్లో వధువు కారులో పోజులిచ్చి పెళ్లి మండపం దగ్గరకు సంతోషంగా వస్తుంది.. ఆ తర్వాత తన వరుడిని కౌగిలించుకోవడం చూడవచ్చు.. ప్రియురాలి కోరిక మేరకు వరుడు ఆ చలిలో పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.. వివాహానికి సంబంధించిన మరొక వీడియోను గో హిమాచల్ Xలో షేర్ చేసింది. వివాహ ఆచారాల తర్వాత వధువు మరియు వరుడు చేతి తొడుగులు ధరించడంలో జంట యొక్క వ్యక్తులు సహాయం చేస్తున్నట్లు వీడియో చూపించింది. వధువు పూలతో అలంకరించిన ఎరుపు రంగు కారును నడుపుతూ తన వరుడితో కలిసి వేదిక నుండి బయలుదేరడంతో వీడియో ముగుస్తుంది..ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది..