కొత్త మోడల్ : రూ.5 లక్షల్లోనే మారుతీ కె10 టూర్ హెచ్ 1 కారు

కొత్త మోడల్ : రూ.5 లక్షల్లోనే మారుతీ కె10 టూర్ హెచ్ 1 కారు

దేశీయంగా అతిపెద్ద కార్ల త‌య‌రీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). విభిన్న వ‌ర్గాల క‌స్టమ‌ర్ల ఆకాంక్షల‌కు అనుగుణంగా, అందుబాటు ధ‌ర‌ల్లో మోడ‌ల్స్ డిజైన్ చేయ‌డంలోనూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని మరో రెండు మోడల్స్ ను ఆవిష్కరించనుంది.. 

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి మార్కెట్‌లోకి కస్టమర్ల  అవసరాల కోసం కొత్త కారును విడుదల చేసింది. ఆల్టో K10 కి వాణిజ్య వైర్షన్‌ టూర్ H1(Tour H1) ని లాంచ్‌ చేసింది. కొత్త టూర్ హెచ్1 ఇప్పటికే విక్రయంలో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10 కి వాణిజ్య వెర్షన్, మారుతి సుజుకి కార్లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉండటమే కాకుండా అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి. అందుకే ఈ ఇండో జపనీస్ జాయింట్ వెంచర్ ప్రతి నెలా లక్షల కార్లను మార్కెట్‌లో విక్రయించగలుగుతోంది. అంతే కాకుండా ఇతర బ్రాండ్‌ల మాదిరిగానే, వాణిజ్య అవసరాల కోసం కూడా మారుతి సుజుకి బ్రాండ్‌లో కార్లు విక్రయించబడుతున్నాయి. 

మారుతి  ఆల్టో కే10 కొత్త ఫీచర్ల కారు

దేశీయంగా అతిపెద్ద కార్ల త‌య‌రీ సంస్థ మారుతి సుజుకి. అందుబాటు ధ‌ర‌ల్లో మోడ‌ల్స్ డిజైన్ చేయ‌డంలోనూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంది. ఇప్పుడు కొత్తగా తాజాగా ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) టెక్నాల‌జీ బేస్డ్ క‌మ‌ర్షియ‌ల్ హ్యాచ్ బ్యాక్ (commercial hatchback) `టూర్ హెచ్‌1 (Tour H1)`మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధ‌ర రూ.4.80 ల‌క్షలుగా నిర్ణయించింది. కొత్తగా క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ ప‌డే ఈ హ్యాచ్ బ్యాక్ టూర్ హెచ్‌1 (Tour H1) మార్కెట్‌లో మూడు క‌ల‌ర్స్ - మెటాలిక్ సిల్కీ సిల్వర్ (Metallic Silky Silver), మెటాలిక్ గ్రానైట్ గ్రే (Metallic Granite Grey), ఆర్కిటిక్ వైట్ (Arctic White) ఆప్షన్లలో ల‌భిస్తుంది. 

రెండు మోడల్స్

 జులై 5న లాంచ్‌ కానున్న మారుతి సుజుకి Engage.. ఆ MPV తరహాలోనే.. గత కొన్నేళ్లుగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో ఆల్టో మోడల్స్ 'టూర్' పేరుతో విక్రయిస్తోంది. తాజాగా విడుదలైన మారుతి సుజుకి టూర్ H1 రెండు వెర్షన్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.  నెక్ట్స్ జ‌న‌రేష‌న్ టెక్నాల‌జీతో రూపు దిద్దుకున్న టూర్ హెచ్‌1 (Tour H1) కారు డ్యూయల్ జెట్ మరియు డ్యూయల్ VVT టెక్‌తో ఒకే 1.0 లీటర్ K సిరీస్ ఇంజిన్‌ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి. పెట్రోల్ వేరియంట్ 66.6 పీఎస్ విద్యుత్ + 89 ఎన్ఎం టార్చి, సీఎన్జీ వేరియంట్ 56.6 పీఎస్ విద్యుత్ +82.1 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ గేర్ బాక్స్‌తో రూపుదిద్దుకున్నది. 

టూర్ హెచ్‌1

మారుతి సుజుకి టూర్ హెచ్‌1 (Tour H1) పెట్రోల్ వేరియంట్ CNG రెండు ట్యాంకుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. .. లీట‌ర్ పెట్రోల్‌పై 24.60 కి.మీ, సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 34.46 కి.మీ. మైలేజీనిస్తుంది. పెట్రోల్‌ ఇంజిన్‌తో టూర్‌ H1 65.7 bhp వద్ద 89 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. . ఇది 27 లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. మరోవైపు మారుతి సుజుకి టూర్ H1 CNG ను పరిశీలిస్తే.. 55.9 bhp వద్ద 82.1 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి టూర్ H1 CNG 34.46km మైలేజీని అందిస్తుంది. ఇది 55-లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. 

ధర ఎంతంటే? 

మారుతి సుజుకి టూర్ H1 ధరలు ఎక్స్ షోరూమ్‌లో సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. ధర కేవలం రూ. 4,80,500 నుంచి ప్రారంభమవుతాయి. పెట్రోల్‌తో నడిచే టూర్ హెచ్1 ధర ఎక్స్‌ షోరూమ్‌లో రూ. 4,80,500 కాగా, సీఎన్‌జీ వెర్షన్ ధర రూ. 5,70,500గా ఉంది. 

సేఫ్టీ ఫీచర్స్ 

మారుతి సుజుకి టూర్ H1లో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో కూడిన ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, ముందు మరియు వెనుక ప్రయాణీకులకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఇలా అనేక రకాలుగా భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. టూర్ హెచ్1 కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ విడుదల గురించి మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ  తెలిపారు.  టూర్‌ H1 విశ్వసనీయమైన నెక్స్ట్ జెన్ K 10C ఇంజిన్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ మరియు ఎక్స్‌టీరియర్స్‌తో పాటు సౌలభ్యం, భద్రతా ఫీచర్‌లతో వస్తుంది. మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తూ వినియోగదరాలకు మంచి అనుభూతినిస్తుందని ఆయన పేర్కొన్నారు