జిమ్నీ మోడల్‌లో థండర్ ఎడిషన్‌ను మారుతి లాంచ్ చేసింది. జెటా, ఆల్ఫా వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ధర రూ.10.74 లక్షల నుంచి రూ.14.05 లక్షల మధ్య (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది. ఒరిజినల్ జిమ్నీ మోడల్‌లోని ఫీచర్లు ఈ థండర్ ఎడిషన్‌లో కూడా ఉన్నాయి. కొన్ని అదనపు ఫీచర్లనూ యాడ్ చేశారు. 1.5 లీటర్ల, 4 సిలిండర్, కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఈ కారులో అమర్చారు.
