
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానం మరింత బలపరచుకోవడానికి మారుతి సుజుకి కొత్త వ్యూహాన్ని అవలంబిస్తోంది. కంపెనీ రాబోయే సంవత్సరాల్లో స్ట్రాంగ్ హైబ్రిడ్లు, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, CNG అలాగే ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. వీటిలో ప్రధాన దృష్టి స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపైనే కంపెనీ పెట్టిందని వెల్లడైంది.
కంపెనీ తన సొంతంగా అభివృద్ధి చేస్తోన్న సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ని విస్తృతంగా వినియోగించడానికి చర్యలు చేపట్టింది. ఈ టెక్నాలజీ 1.2 లీటర్, 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా రూపొందించబడుతుంది. టయోటా అందించే అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ సిస్టమ్ కంటే చవకగా ఉండే వీలుంది. ముఖ్యంగా లీటరుకు 35 కి.మీ. పైగా మైలేజ్ అందించగలదని అంచనాలు ఉన్నాయి.
మారుతీ సుజుకీ నుంచి రాబోయే కొత్త కారు మోడల్స్..
1. మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్:
2026 మెుదట్లో ఫ్రాంక్స్ హైబ్రిడ్ మార్కెట్లోకి రానుంది. ఇది మారుతి తీసుకొస్తున్న మొదటి స్వదేశీ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కారుగా నిలుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కారులో ADAS (అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ ఉన్నట్లు తెలుస్తోంది.
2. కొత్త తరం బాలెనో:
ఫ్రాంక్స్ తర్వాత బాలెనో హాచ్బ్యాక్ కూడా కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌తో తీసుకొస్తోంది మారుతీ ఇండియా మార్కెట్లో. జపాన్‌లో అమ్ముడవుతున్న సుజుకి స్పేసియా ఆధారంగా వస్తుంది.
3. హైబ్రిడ్ పవర్ ట్రైన్:
మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు శక్తినిచ్చే దాని 1.2L, 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడైజ్ చేసే అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ టయోటా అట్కిసన్ సైకిల్ సిస్టమ్ కంటే గణనీయంగా ఖర్చుతో కూడుకున్నది. ఇది సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్, 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని లీటరుకు అందిస్తుంది.
4. ప్రీమియం SUV:
4.5 మీటర్లకంటే ఎక్కువ పొడవుతో, మూడు వరుసల సీటింగ్ తో రానుంది. ఇది గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్ పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. టాటా సఫారి, హ్యుందాయ్ అల్కజార్, మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ వంటి మోడల్స్‌తో పోటీ పడనుంది.
హైబ్రిడ్ మోడల్స్ విస్తరణతో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వినియోగదారులను ఆకర్షించాలనుకుంటోంది. BEVs వైపు కూడా అడుగులు వేస్తూనే, స్వల్ప ఖర్చుతో హైబ్రిడ్ టెక్నాలజీని అందించడం ద్వారా మధ్య తరగతి కొనుగోలుదారులను టార్గెట్ చేయాలని లక్ష్యంగా మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్లో ముందుకు సాగుతోందని తెలుస్తోంది.