
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కావడంతో గురువారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో నిర్వహించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కు మంత్రులు ఫస్ట్ టైమ్ మాస్కులు వేసుకొని హాజరయ్యారు. స్కూల్స్, కాలేజీలను ఈ నెలాఖరు వరకు తెరవకూడదని గత మీటింగ్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించారు. మరోవైపు కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజ్వాల్.. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టాస్క్ ఫోర్స్ తో కలసి మీటింగ్ జరిపారు. ఈ సమావేశంలోనూ కేజ్రీవాల్, బజ్వాల్ తో సహా అధికారులు మాస్కులు వేసుకొనే పాల్గొన్నారు.