Ravi Teja: 'నేను వచ్చాక ఒకటే జోన్... వార్ జోన్'! 'మాస్ జాతర' ట్రైలర్ రిలీజ్..

Ravi Teja: 'నేను వచ్చాక ఒకటే జోన్... వార్ జోన్'! 'మాస్ జాతర' ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' విడుదలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ  ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

పవర్ ఫుల్ రైల్వే పోలీస్‌గా రవితేజ

దర్శకుడు భాను భోగవరపు టేకింగ్‌లో రవితేజను మరోసారి ఫుల్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్‌గా నటించడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన 'సూపర్ డూపర్' పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

యాక్షన్ హైలైట్స్

ట్రైలర్‌ను గమనిస్తే, రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రైల్వే స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్‌కు పిచ్చెక్కించే డైలాగ్‌లు రవితేజ స్టైల్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా, "రైల్వేలో ఈస్ట్‌ జోన్, వెస్ట్‌ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి... నేను వచ్చాక ఒకటే జోన్... వార్ జోన్!" అనే డైలాగ్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజకు ప్రతినాయకునిగా టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే హై-ఇంటెన్స్ క్లాష్ సినిమా కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుందని తెలుస్తోంది.

►ALSO READ | చిత్ర పరిశ్రమ అవసరాలకే ఫిల్మ్ ఛాంబర్: 'బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' అంటూ సినీ పెద్దల కొవ్వొత్తుల ర్యాలీ!

ఈ భారీ యాక్షన్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్  సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న ఈ 'మాస్ జాతర' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.