ధమాకా రొమాంటిక్ ఫస్ట్ గ్లింప్స్

ధమాకా రొమాంటిక్ ఫస్ట్ గ్లింప్స్

మాస్ మహరాజా ‘రవితేజ’ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ‘క్రాక్’ సినిమా హిట్ అనంతరం వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టు కాలేకపోయాయి. అయినా.. తగ్గేదేలే అంటూ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ‘ధమాకా’ సినిమాలో మాస్ పాత్రలో నటిస్తున్నారు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర టీం బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను వినాయక చవితి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.  సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు Abhishek Agarwal Arts ట్వీట్ చేసింది.

పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. రవితేజ సరసన ‘పెళ్లి సందడి’ ఫేం శ్రీలీల నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ‘పెళ్లి సంద‌‌‌‌‌‌‌‌D’తోనే టాలీవుడ్‌లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. క్యూట్ లుక్స్‌‌‌‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న ఆమె.. టాలీవుడ్‌‌‌‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. రవితేజ ‘ధమాకా’తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ శ్రీలీల నటిస్తోంది.