హ్యాట్రిక్ కొట్టాలని..

హ్యాట్రిక్ కొట్టాలని..

రవితేజ్ కెరీర్‌‌‌‌లో చెప్పుకోదగ్గ రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరిద్దరి కాంబినేషన్‌‌లో వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు సూపర్బ్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌గా మెప్పు పొందాయి. ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. రవితేజ 66వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం గోపీచంద్‌‌కి దక్కింది. బి.మధు  నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు గోపీచంద్. ఇందులో రవితేజ పవర్‌‌‌‌ఫుల్ పోలీసాఫీసరు పాత్రలో కనిపించనున్నాడు. నవంబర్‌‌‌‌లో మూవీ సెట్స్‌‌కి వెళ్లనుంది. ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. మరి ఈ సక్సెస్‌‌ఫుల్ కాంబినేషన్‌‌ మరో సక్సెస్‌‌ను అందుకుని హ్యాట్రిక్‌‌ కొడుతుందేమో చూడాలి.